Special Pooja

0 review
Rated 5 out of 5

500.00

దేవీ నవరాత్రుల పవిత్ర సందర్భంలో “ప్రత్యేక పూజ” (విరాళం: రూ. 500/-) సేవను నమోదు చేసుకుని శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందండి. నవరాత్రులలో మీరు కోరిన ఒక రోజున మీ గోత్రనామాలతో వేద పండితులైన ఋత్విక్కులచే సకల పూజలు, హోమములు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. నేరుగా రాలేని భక్తులకు పవిత్ర యాగ ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపబడుతుంది.

Description

దేవీ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా భక్తులందరూ అమ్మవారి కృపాకటాక్షాలు పొందేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సులభమైన మరియు మహిమాన్వితమైన సేవ “ప్రత్యేక పూజ”.

సేవా విశేషాలు:

  • దాతల ప్రత్యేకాభిష్టం: దేవీ నవరాత్రుల 10 రోజులలో దాతలు కోరుకున్న ఏదైనా ఒక ప్రత్యేక రోజున (మీ జన్మ నక్షత్రం, పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం మొదలైన శుభదినాన) మీ గోత్రనామాలతో పూజ జరిపించవచ్చు.

  • శాస్త్రోక్త పూజాధికాలు: వేద పండితులైన ఋత్విక్కులచే మీ కుటుంబ శ్రేయస్సును కాంక్షిస్తూ సకల పూజలు మరియు విశేష హోమములు నిర్వహించబడతాయి.

ప్రసాద వితరణ:

ఈ పూజా సేవలో ప్రత్యక్షంగా (నేరుగా) పాల్గొనలేని దాతల పేరిట ఋత్విక్కులు శాస్త్రోక్తంగా పూజాకార్యక్రమాలు పూర్తి చేసి, అమ్మవారి దివ్య యాగ ప్రసాదంను పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకు సురక్షితంగా అందజేస్తారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Special Pooja”

Your email address will not be published. Required fields are marked *