Description
మహాశక్తి యాగం & విశేష నవరాత్రి పూజలు
దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులందరి సర్వాభీష్ట సిద్ధికై మరియు సర్వ అరిష్ట శాంతికై నిర్వహించబడుతున్న మహిమాన్వితమైన పూజా కార్యక్రమాలలో పాల్గొనడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
యాగ విశేషాలు & పూజా వివరాలు:
-
10 రోజుల సకల పూజలు: నవరాత్రి 10 రోజులు దాతల గోత్రనామాలతో సకల పూజలు మరియు హోమములు ఋత్విక్కులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి.
-
మహాశక్తి “ఐశ్వర్య దీప పూజ”: అత్యంత పవిత్రమైన అష్టమి తిథి రోజు ఉదయం జరిగే ఐశ్వర్య దీప పూజలో పాల్గొనవచ్చు. భక్తులకు అత్యంత విలువైన శ్రీ ఐశ్వర్యాంబికా అమ్మవారి ఐశ్వర్య దీపము మరియు పూజా ద్రవ్యాలు అందజేయబడతాయి. వీటితో మీరు స్వయంగా పూజలో పాల్గొనవచ్చు.
-
నవశక్తి హోమము & పూర్ణాహుతి: అష్టమి సాయంత్రం జరిగే “నవశక్తి హోమము”లో మీకు ప్రత్యేకంగా కేటాయించబడిన హోమకుండంలో విశేష ద్రవ్యాలతో నవశక్తి హోమము మరియు పూర్ణాహుతిని స్వయంగా నిర్వహించుకునే అవకాశం కల్పించబడుతుంది.
ముఖ్య గమనిక:
ఈ యాగంలో ప్రత్యక్షంగా (నేరుగా) పాల్గొనలేని దాతల పేరిట వారి గోత్రనామాలతో ఋత్విక్కులచే పూజలు, హోమములు పూర్తి చేసి, పవిత్ర యాగ ప్రసాదం పోస్ట్ ద్వారా మీ ఇంటికి సురక్షితంగా పంపబడుతుంది.
అమ్మవారి దివ్యానుగ్రహం పొంది, మీ కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యాలు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాము.

Reviews
There are no reviews yet.